ఫేక్ ఫింగర్ ప్రింట్స్ కేసులో విచారణ వేగవంతం

ఫేక్ ఫింగర్ ప్రింట్స్ కేసులో విచారణ వేగవంతం

జీహెచ్ఎంసీ ఫేక్ ఫింగర్ ప్రింట్స్ కేసులో టాస్క్ఫోర్స్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో గోషామహల్ ఎస్ఎఫ్ఏ వెంకట్ రెడ్డి తో పాటు మరో ఇద్దరిని చాదర్ ఘాట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఫెవికాల్, ఎమ్సీల్ మిక్స్ చేసి కృత్రిమ వేలిముద్రలు తయారీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. యూట్యూబ్ లో చూసి కృత్రిమ వేలిముద్రలు తయారీ చేశారని తెలిపారు. ఫెవికాల్, ఎమ్ సీల్ మిక్స్ చేస్తే వచ్చిన సింథటిక్ లాంటి పదార్థాన్ని తమతో పాటు ఫీల్డ్ లోకి తీసుకెళ్లి పంచింగ్ వేసినట్లు గుర్తించారు. 43 కృత్రిమ ఫింగర్ ప్రింట్స్, 3 అటెండెన్స్ మిషన్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలో అసలు సూత్రధారులెవరో బయటపెడతామని వారు స్పష్టం చేశారు.