
ములుగు, వెలుగు : ములుగు మండలం ఇంచర్లకు చెందిన జర్నలిస్ట్ కుంచం రమేశ్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న మానుకోట సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ఆదివారం రమేశ్‌ను పరామర్శించారు.
అనంతరం రూ. 25 వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి సమస్యనైనా ఆత్మస్థైర్యంతో జయించాలని సూచించారు. అధైర్యపడకుండా కుటుంబానికి అండగా నిలవాలని, సర్వర్ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.