వరస్ట్ స్ట్రీట్ ఫుడ్‌లలో మన బోండాలది 10వ స్థానం.. మిగతావి ఏంటో తెలుసా?

వరస్ట్ స్ట్రీట్ ఫుడ్‌లలో మన బోండాలది 10వ స్థానం.. మిగతావి ఏంటో తెలుసా?

మన దేశంలో ప్రజల ఆహారపు అలవాట్లు ఎంత విభిన్నంగా ఉంటాయో.. గల్లీల వెంబడి ఉండే స్ట్రీట్ ఫుడ్లను చూస్తే ఎవరికైనా అర్ధమైపోతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఏ రోడ్డుపై చూసినా, ఆ గల్లీలోకి వెళ్లినా.. స్ట్రీట్ ఫుడ్లే దర్శనమిస్తుంటాయి. మిర్చి బజ్జి మొదలు పానీ పూరీ, వడపావ్, న్యూడిల్స్, వెజ్ మంచూరియా, మోమోస్.. ఇలా అనేక రకాల స్ట్రీట్ ఫుడ్స్ కనిపిస్తుంటాయి. వీటిని మనోళ్లు గాబరా గాబరాగా లొట్టలేసుకుని తింటుంటారు. 

అయితే, ఇలాంటి స్ట్రీట్ ఫుడ్‌లలో అత్యంత చెత్తవి ఏంటన్న దానిపై ఓ సంస్థ సర్వే నిర్వహించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టేస్ట్ అట్లాస్ అనే ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ సంస్థ.. వినియోగదారులు ఇచ్చిన రేటింగ్ ఆధారంగా ఏ స్ట్రీట్ ఫుడ్ ఎంత వరస్ట్ అన్నది నిర్ణయించింది. ఈ జాబితాలో మహారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ దహీ పూరీ అగ్రస్థానం దక్కించుకోగా.. మధ్యప్రదేశ్‌కు చెందిన సెవ్  రెండవ స్థానంలో నిలిచింది. మొత్తం 2,508 రేటింగ్ లలో దహీపూరీకి 1,733 వరస్ట్ రేటింగ్స్ వచ్చాయి. దీన్ని బట్టి మన భారతీయులు.. దహీ పూరీని ఎంత అసహ్యించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. 

ఈ జాబితాలో మన దక్షణాది ప్రసిద్ధ టిఫిన్ బోండా పదవ స్థానాన్ని దక్కించుకుంది.

ఇండియాలో టాప్-10 చెత్త స్ట్రీట్ ఫుడ్స్(టేస్ట్ అట్లాస్) 

1. దహీ పూరీ
2. సెవ్
3. దబేలీ
4. బాంబే శాండ్‌విచ్
5. ఎగ్ భుర్జీ
6. దహీ వడ
7. సబుదానా వడ
8. పాప్రీ చాట్
9. గోబీ పరాఠా
10. బోండా

సర్వేలో వెల్లడైంది కదా! అని తినడం మానేయకండాయ్.. ఎవరి టేస్ట్ వారిది. మీకు నచ్చిందా! మొహమాటం లేకుండా లాగించండి. లేదంటే మా సర్వే వచ్చాక.. ఎంత మంది తినడం మానేశారని మరో సర్వే చేసినా.. చేస్తారు.