- తప్పిన ప్రమాదం
జైపూర్, వెలుగు : జైపూర్మండలంలోని ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనంలో మంటలు చెలరేగి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని నెన్నెల మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన పలువురు ఓ శుభాకార్యానికి టాటా ఏస్ వాహనంలో కరీంనగర్‌కు వెళ్తుండగా..
మార్గమధ్యలో వెహికల్లోనుంచి పొగ రావడాన్ని డ్రైవర్ గమనించారు. అప్రమత్తమై వాహనాన్ని పక్కకు ఆపాడు. మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. మంటలు ఎగిసిపడి వెహికల్ కాలిబూడిదైంది.