న్యూఢిల్లీ: ఇంకో ఐదేళ్లలో తయారీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మంగళవారం ప్రకటించారు. ‘దేశ తయారీ రంగంలో బోలెడు అవకాశాలు ఉన్నాయి. ఈ సెక్టార్‌లో ఉద్యోగాలు క్రియేట్ చేయకపోతే వికసిత భారత్‌ను అందుకోలేం. ప్రతీ నెల 10 లక్షల మంది వర్క్‌ఫోర్స్ (పనిచేయగలిగేవారు) లేబర్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మనం 10 కోట్ల ఉద్యోగాలను క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సెమీకండక్టర్ వంటి సెక్టార్లలో ఒక జాబ్‌ను డైరెక్ట్‌గా క్రియేట్ చేస్తే 8–10 జాబ్‌లు ఇన్‌డైరెక్ట్‌గా క్రియేట్ అవుతాయి’ అని ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (ఐఎఫ్‌క్యూఎం) మొదటి ఎడిషన్‌లో ఆయన వివరించారు.
మాన్యుఫాక్చరింగ్ జాబ్స్‌తో మరిన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చన్నారు. ప్రభుత్వం సపోర్ట్ చేస్తోందని, చాలా వేగంగా ప్రాజెక్ట్‌లను మొదలు పెట్టగలుగుతున్నామని చంద్రశేఖరన్ అన్నారు. సెమీకండక్టర్, ప్రిసిసన్ మాన్యుఫాక్చరింగ్, అసెంబ్లింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీస్, సంబంధిత సెక్టార్లలోని తమ పెట్టుబడులతో ఇంకో ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేయగలుగుతామని పేర్కొన్నారు. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌లో మరిన్ని జాబ్‌లు క్రియేట్ అవ్వాలంటే సుమారు 500 నుంచి వెయ్యి చిన్న, మధ్యతరహా తయారీ కంపెనీలు ఏర్పాటు కావాలన్నారు.