టాటా ఆటోకాంప్ చేతికి ఆర్టిఫెక్స్‌‌​

టాటా ఆటోకాంప్ చేతికి ఆర్టిఫెక్స్‌‌​

న్యూఢిల్లీ:  జాగ్వార్ ల్యాండ్ రోవర్ గ్రూప్‌‌లో భాగమైన ఆర్టిఫెక్స్ ఇంటీరియర్ సిస్టమ్స్ లిమిటెడ్‌‌లో 80 శాతం వాటాను  కొనుగోలు చేస్తామని టాటా ఆటోకాంప్ సిస్టమ్స్  ఆదివారం ప్రకటించింది. డీల్ విలువ మాత్రం బయటపెట్టలేదు.  

జాగ్వార్ ల్యాండ్ రోవర్ వెంచర్స్ లిమిటెడ్‌‌కు ఆర్టిఫెక్స్‌‌లో ఉన్న వాటాలను  కంపెనీ కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోలుతో టాటా ఆటోకాంప్‌‌ ఇండియాలో  అతిపెద్ద ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీ కంపెనీగా ఎదగనుంది.  యూరప్‌‌లో విస్తరించనుంది.