హైదరాబాద్, వెలుగు: ఒరిజినల్ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్(ఓఈఎంలకు) సేవలందించే ఆటోమోటివ్ కాంపోనెంట్స్ సంస్థ టాటా ఆటోకాంప్ సిస్టమ్స్, ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 లో టెక్నాలజీ -ఫస్ట్ సొల్యూషన్స్‌ను ప్రదర్శించింది.
వీటిని దేశీయంగానే అభివృద్ధి చేసింది. కంపెనీ స్టాల్‌ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ గోయల్ ప్రారంభించారు. సంస్థ ప్రదర్శించిన వాటిలో ఈవీల విడి భాగాలు, లిథియం -అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు, ఈవీ ఛార్జర్‌లు, ఈ–-కంప్రెసర్‌లు, ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ ట్రెయిన్లు, ఐసీఈ పవర్‌ట్రెయిన్ సొల్యూషన్స్ ఉన్నాయి.