
న్యూఢిల్లీ: ఆర్థిక సేవలు అందించే టాటా క్యాపిటల్ఐపీఓ ద్వారా రూ.15 వేల కోట్లు సేకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం సెబీకి ప్రీ–ఫైలింగ్ మార్గంలో సెబీకి రహస్యంగా డాక్యుమెంట్లు అందజేసింది.
దీంట్లో ఫ్రెష్ ఇష్యూ ద్వారా 2.3 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్ముతారు. ఆఫర్ ఫర్ సేల్ విధానంలో టాటా సన్స్ షేర్లు అమ్ముతారు. వీరికి టాటా క్యాపిటల్‌లో 93 శాతం వాటా ఉంది. ఐపీఓ కోసం కంపెనీ బోర్డు ఇది వరకే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఆర్బీఐ రూల్స్ ప్రకారం టాటా సన్స్, టాటా క్యాపిటల్‌లో అప్పర్ లేయర్ఎన్బీఎఫ్సీలు కాబట్టి ఈ ఏడాది సెప్టెంబరులోపు లిస్టింగ్‌కు రావాల్సి ఉంటుంది.