హైదరాబాద్, వెలుగు: స్టూడెంట్లకు రూ.85 లక్షల వరకు పూచీకత్తు లేకుండానే ఎడ్యుకేషన్లోన్లు ఇస్తామని టాటా క్యాపిటల్ ప్రకటించింది. మొత్తం చదువుకయ్యే ఖర్చును కవర్ చేయడానికి రూ.2 కోట్ల వరకు సెక్యూర్డ్ లోన్లను అందజేస్తుంది. ట్యూషన్ ఫీజులు, జీవన ఖర్చులు, స్టడీ మెటీరియల్, ఇతర ఖర్చులను కూడా కవర్ చేస్తుంది.
దేశీయ, విదేశీ విద్యాసంస్థల్లో చేరే స్టూడెంట్లు తమ దగ్గర లోన్లు తీసుకోవచ్చని టాటా క్యాపిటల్ప్రకటించింది. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, ముంబై, పూణే, ఢిల్లీ, వడోదర, అహ్మదాబాద్, సూరత్, మైసూర్, కోయంబత్తూర్ వంటి నగరాల నుంచి ఫారిన్ఎడ్యుకేషన్ లోన్లకు ఎక్కువ డిమాండ్ ఉందని తెలిపింది.
మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, ఏవియేషన్, మెడిసిన్, టెక్నాలజీ, అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లు వంటి రంగాల ఎమర్జింగ్ కోర్సుల్లో చేసే విద్యార్థుల అవసరాలను తీర్చడం కోసం దృష్టి సారించామని టాటా క్యాపిటల్ తెలిపింది. ఎక్కువ మంది అమెరికా, జర్మనీ, ఐర్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్తున్నారని పేర్కొంది.