టెస్లా కార్లకు టాటా పార్టులు?

టెస్లా కార్లకు టాటా పార్టులు?

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు  విడిభాగాలు, సర్వీస్‌‌‌‌‌‌‌‌ను టాటా గ్రూప్ సప్లయ్ చేయనుందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఈ ఈవీ కంపెనీకి గ్లోబల్‌‌‌‌‌‌‌‌ సప్లయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిందని తెలిపింది. ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచన టెస్లా ఉంది. ఈ కంపెనీ సప్లయర్లను రెడీ చేసుకుంటోందని  రిపోర్ట్స్ వస్తున్నాయి. టెస్లా సప్లయ్ చెయిన్‌‌‌‌‌‌‌‌లో  టాటా ఆటోకాంప్‌‌‌‌‌‌‌‌, టీసీఎస్‌‌‌‌‌‌‌‌, టాటా టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌, టాటా ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌ భాగమయ్యాయి.  

టెస్లా కార్ల కోసం  సర్వీస్‌‌‌‌‌‌‌‌లు, కాంపోనెంట్లను ఇవి సప్లయ్ చేయనున్నాయి. ఈ కంపెనీలు టెస్లాతో ఇప్పటికే గ్లోబల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి.   కేవలం టాటా కంపెనీలే కాకుండా ఇతర  ఇండియన్ కంపెనీలతో కూడా  టెస్లా జతకడుతోంది. వీటి నుంచి పార్టులను సేకరించనుంది.  వైర్లు, ఎలక్ట్రిక్ మోటార్లు, గేర్ బాక్స్‌‌‌‌‌‌‌‌లు, ఫోర్జ్డ్‌‌‌‌‌‌‌‌ పార్టులు,  కాస్టింగ్స్‌‌‌‌‌‌‌‌, షీట్ మెటల్‌‌‌‌‌‌‌‌, హై వాల్యూ ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌, సస్పెన్సన్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రిక్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రెయిన్స్‌‌‌‌‌‌‌‌ వంటివి ఇండియా సప్లయర్ల నుంచి సేకరించాలని టెస్లా చూస్తోంది.