
ముంబై: ఐపీఎల్ టైటిల్ స్పాన్నర్‌గా టాటా మరో ఐదేండ్లు కొనసాగనుంది. ఈ మేరకు టాటాగ్రూప్‌తో ఒప్పందాన్ని పొడిగించినట్టు బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఐదేండ్ల టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం టాటా రికార్డు స్థాయిలో రూ. 2500 కోట్లు చెల్లిస్తుందని తెలిపింది. గత రెండు సీజన్లలో టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న టాటా గ్రూప్.. విమెన్స్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్‌గానూ కొనసాగుతోంది.