టాటా చైర్మన్​ చంద్రశేఖరన్​ శుభవార్త చెప్పారు.. ఇదే జరిగితే ఎంత బాగుంటుందో..

టాటా చైర్మన్​ చంద్రశేఖరన్​ శుభవార్త చెప్పారు.. ఇదే జరిగితే ఎంత బాగుంటుందో..

న్యూఢిల్లీ : రాబోయే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు టాటా గ్రూప్​ ప్రకటించింది. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రిక్​ వెహికల్స్​, సోలార్​ ఇండస్ట్రీల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని టాటా సన్స్​ చైర్మన్​ చంద్రశేఖరన్​ వెల్లడించారు. చిప్స్​, బ్యాటరీలు, ఈవీలు, సోలార్ ​పవర్ ​ఎక్విప్​మెంట్​ తయారీ కోసం పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నామని ప్రకటించారు. రిటైల్​, టెక్​సర్వీసెస్​, ఆతిథ్యరంగ సెక్టార్ల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రశేఖరన్ ​అన్నారు.

‘‘ఈ ఏడాది మేం ఎన్నో మైలురాళ్లను అధిగమించాం. ఏడు ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేశాం. ఇండియాలోనే మొదటి సెమీకండక్టర్​ ఫ్యాబ్​ను గుజరాత్ ​నగరం ధొలెరాలో మొదలుపెట్టాం. కర్ణాటక నరసుపారాలో ఎలక్ట్రానిక్​అసెంబ్లీ ప్లాంటును, తమిళనాడు పణక్కంలో ఆటోమోటివ్​  ప్లాంటును, బెంగళూరులో ఎంఆర్​ఓ ఫెసిలిటీని ఆరంభించాం. గుజరాత్​ సాణంద్​లో బ్యాటరీ సెల్​ తయారీ ఫ్యాక్టరీని నిర్మించాం. తమిళనాడులోని తిరునెల్వేలిలో  సోలార్​ మాడ్యూల్​ ప్రొడక్షన్​ను మొదలుపెట్టాం”అని ఆయన వివరించారు.