
తెలంగాణ నుంచే మాకు ఎక్కువ ఆదాయం వస్తోంది
హైదరాబాద్‌లోని టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు 2,500 మందిని రిక్రూట్ చేశాం: జీనియస్ సీఎండీ
వెలుగు, బిజినెస్‌డెస్క్: ఇండియాలో గిగ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతోందని జీనియస్ కన్సల్టెంట్స్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్(సీఎండీ) రాజేంద్ర ప్రసాద్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన వెలుగు రిపోర్టర్‌కిచ్చిన ఇంటర్యూలో పై విషయాలు పంచుకున్నారు. తెలంగాణలోని కార్యకలాపాల వల్లే కంపెనీకి ఎక్కువ రెవెన్యూ వస్తోందన్నారు. సిటీలోని ఫార్మా, ఇన్ఫ్రా స్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, ఐటీ కంపెనీల నుంచి ఎక్కువ ఆఫర్లొస్తున్నాయన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు 2,500 మందిని నియమించామని తెలిపారు. ఇందులో సైట్ ఇంజినీర్ల నుంచి గ్రౌండ్ వర్కర్స్ వరకు ఉన్నారని అన్నారు. జీనియస్ కన్సల్టెంట్స్‌కి ఈ వ్యాపారంలో 27 ఏళ్ల అనుభవం ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ రూ. 1,200 కోట్లకు చేరుకుందన్నారు. 2019 మే లో ఐపీఓకి రావాలనుకున్నామని, సెబీ అనుమతి కూడా వచ్చిందన్నారు. కానీ రావడానికి వీలుపడలేదన్నారు. 2021–-22 నాటికి ఐపీఓకి వస్తామన్నారు.నాలుగు గంటలు, ఎనిమిది గంటలు వంటి కొద్ది సమయానికి కూడా నిపుణులను అందిస్తామని అన్నారు. ఎల్‌జీబీటీఐక్యూ కమ్యూనిటీని కూడా రిక్రూట్ చేస్తున్నామని, వారి స్కిల్స్‌ను మాత్రమే చూస్తున్నామని తెలిపారు.
ఉద్యోగుల జీతాలు, బెనిఫిట్స్ మేమే చూసుకుంటాం..
ప్రస్తుతం తమ కంపెనీ రిక్రూట్ మెంట్, పేరోల్ ప్రాసెస్, బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ వంటివి చేస్తుందని యాదవ్ తెలిపారు. లేబర్ చట్టానికి అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం గతంలో ఉన్న లేబర్ రూల్స్‌ను నాలుగుకి తగ్గించిందని ఇది మేలు చేసే చర్యని తెలిపారు. లైసెన్సింగ్‌లో సంస్కరణలు తీసుకురావాలన్నారు. జీనియస్ కన్సల్టెంట్స్ ద్వారా రిక్రూట్ అయిన ఉద్యోగుల జీతాలు, వారి పీఎఫ్ వంటి ఎంప్లాయిస్ బెనిఫిట్స్ బాధ్యత తమదేనని తెలిపారు. రిక్రూటింగ్ ప్రాసెస్‌లో జాబ్ అవసరానికి తగ్గట్టు ఉన్న ప్రొఫైల్స్‌ను షార్ట్ లిస్ట్ చేసి, వారిని ఇంటర్వ్యూ చేస్తామన్నారు. ఇందులో కూడా సెలెక్ట్ అయిన అభ్యర్థులను క్లయింట్లు ఇంకోసారి ఇంటర్వ్యూ చేసి ఫైనల్ చేస్తారన్నారు. జాబ్‌లను ఇప్పించేటప్పుడు ఎటువంటి వివక్ష ఉండదని తెలిపారు.