IPL 2024: 8 గంటలకు ఐపీఎల్ తొలి మ్యాచ్..ఎందుకంటే..?

IPL 2024: 8 గంటలకు ఐపీఎల్ తొలి మ్యాచ్..ఎందుకంటే..?

ఐపీఎల్ ప్రారంభం కావడానికి మరో కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అభిమానులు తొలి మ్యాచ్ కోసం ఎంతో ఆతృత్తగా ఎదురు చూస్తున్నారు. తొలి మ్యాచ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడడంతో ఈ మ్యాచ్ పై భారీ హైప్ నెలకొంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఇప్పటికే నిపుణులు ఫ్యాన్స్ తమ అభిప్రాయలు తెలియజేస్తున్నారు. అయితే అంతకంటే ముందు ఓపెనింగ్ సెర్మనీ అభిమానులను ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. 

ప్రపంచంలోనే బెస్ట్ క్రికెట్ లీగ్ గా ఐపీఎల్ కు భారీ క్రేజ్ ఉంది. దీనికి తగ్గట్టుగానే ఆరంభ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. మ్యాచ్ కు రెండు గంటలకు ముందు అనగా 6 గంటలకు నేడు (మార్చి 22) ఓపెనింగ్ సెర్మనీ స్టార్ట్ కానుంది. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తమ స్టెప్పులతో అలరించడానికి సిద్ధంగా ఉంటే.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, టాప్ సింగర్ సోనూ నిగమ్ తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టనున్నారు.

టీవీలో మ్యాచులు చూడాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్‌లో ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుకతో పాటు మ్యాచులను చూడవచ్చు. ఇక మొబైల్ యూజర్స్ కోసం జియో టీవీలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేక్షకులను జియో ఉచితంగా ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.
  
షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ రాత్రి జరిగే మ్యాచ్ లన్ని 7:30 నిమిషాలకు స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే ఈ ఆరంభ వేడుకల కారణంగా ఐపీఎల్ తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. రేపటి నుంచి సాయంత్రం మ్యాచ్ లు యధావిధిగా 7:30 గంటలకు స్టార్ట్ అవుతాయి. రెండు మ్యాచ్ లు ఉన్న సమయంలో తొలి మ్యాచ్ 3:30 గంటలకు మొదలవుతుంది.