Tata Cars : 250 ఛార్జింగ్ స్టేషన్లు పెడుతున్న టాటా కంపెనీ

టాటా మోటార్స్ దేశమంతటా EV లకోసం 250 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. థండర్ ప్లస్ సొల్యూషన్స్ తో కలిసి ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కొచ్చి, పూణె సహా భారతదేశంలోని 50 నగరాల్లో, వాటి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ కొత్త ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తు న్నారు. దీంతో దేశవ్యాప్తంగా 540 ఈవీ ఛార్జింగ్ పాయింట్ల నెట్ వర్క్ ను విస్తరిస్తోంది.

ASLO READ | తగ్గేదేలే: ఇండియాలో భారీగా పెరిగిన లగ్జరీ కార్ల సేల్స్

ఛార్జింగ్ మౌళిక సదుపాయాలు పెంచడం ద్వారా కస్టమర్లు ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపేలా కంపెనీ లక్ష్యంగా పనిచేస్తుందంటున్నారు ప్రతినిధులు.. ముఖ్యంగా కమర్షియల్ వాహనాలను కస్టమర్లు ఎంచుకునే లక్ష్యంగా కంపెనీ ప్రోత్సహిస్తుందన్నారు. ఇది పచ్చదనంతో కూడిన పర్యావరణ పరిరక్షణకు సాయపడుతుందన్నారు. 

ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సరియైన పాయింట్లు, డీలర్ షిప్ లను సిఫారసు చేయనున్నారు. డెల్టా ఎలక్ట్రానిక్స్ దీనికి అవసరమైన హార్డ్ వేర్ ను సరఫరా చేయనుంది. థండర్ ప్లస్ సోల్యూషన్స్ వాటిని ఇన్ స్టాల్ చేసి ఆపరేట్ చేయనుంది.