- 3 నెలల్లో టాటా గ్రూప్ అమ్మిన బండ్లు 3,41,791
న్యూఢిల్లీ: జేఎల్‌ఆర్ అమ్మకాలతో కలిపి 3,41,791 బండ్లను టాటా మోటార్స్ గ్రూప్ కిందటేడాది అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌లో అమ్మింది. అంతకు ముందు ఏడాది ఇదే టైమ్‌లో అమ్మిన హోల్‌సేల్స్‌తో పోలిస్తే ఒక శాతం వృద్ధి నమోదు చేసింది.
డిసెంబర్ క్వార్టర్‌లో 1,39,829 కార్లను (ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో కలిపి) టాటా మోటార్స్ అమ్మగలిగింది. చైనీస్ మార్కెట్ మినహాయిస్తే జాగ్వర్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) సేల్స్ 1,04,427 బండ్లకు చేరుకున్నాయి. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ డివిజన్ టాటా డేవూ డిసెంబర్ క్వార్టర్‌లో 97,535 బండ్లను అమ్మాయి.