దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఈ దసరాకు భారీ డిస్కౌంట్లకు తెరలేపింది. ‘‘ఫెస్టివల్ ఆఫ్ కార్స్’’ పేరుతో ఎలక్ట్రిక్ కార్ల ధరలపై భారీ తగ్గింపును ప్రకటించింది. కారు మోడల్ను బట్టి రూ.40 వేల నుంచి రూ.3 లక్షల వరకూ తగ్గింపును టాటా మోటార్స్ ప్రకటించడం విశేషం. టియాగో ఈవీ మోడల్పై రూ.40 వేలు, పంచ్ ఈవీ మోడల్పై లక్షా 20 వేలు, నెక్సాన్ ఈవీ మోడల్పై రూ.3 లక్షల భారీ తగ్గింపును టాటా మోటార్స్ ప్రకటించింది. అంతేకాదు.. డిస్కౌంట్స్ అనంతరం టాటా కార్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి.
- టియాగో (Tiago) రూ.4.99 లక్షలు
- ఆల్ర్టోజ్ (Altroz) రూ.6.49 లక్షలు
- నెక్సాన్ (Nexon) రూ.7.99 లక్షలు
- హారియర్ (Harrier) రూ.14.99 లక్షలు
- సఫారీ (Safari) రూ.15.49 లక్షలు
ఈ ఫెస్టివల్ ఆఫర్ అక్టోబర్ 31, 2024 వరకూ మాత్రమేనని టాటా మోటార్స్ స్పష్టం చేసింది. కారు కొనాలనే ఆలోచన ఉండి ధరలు తగ్గితే బాగుండని భావిస్తున్న వారికి టాటా మోటార్స్ ప్రకటించిన ఈ భారీ డిస్కౌంట్స్ కచ్చితంగా ప్రయోజనకరమేనని చెప్పొచ్చు. అయితే.. ఈ డిస్కౌంట్స్కు సంబంధించి ముఖ్య గమనిక ఏంటంటే.. ధరలపై తగ్గింపు అనేది కారు వేరియంట్ను బట్టి మారుతుంటుంది. ఈ విషయాన్ని గమనించాలని టాటా మోటార్స్ విజ్ఞప్తి చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఈ డిస్కౌంట్స్ అనంతరం.. రూ.4.99 లక్షలకే టాటా కారును కొనే అవకాశం వచ్చింది. కేవలం ఎలక్ట్రిక్ కార్లపై మాత్రమే కాదు ఐసీఈ కార్లపై, ఎస్యూవీలపై కూడా టాటా మోటార్స్ ధరల తగ్గింపును ప్రకటించింది. ఐసీఈ రేంజ్ కార్లపై టాటా మోటార్స్ ప్రకటించిన భారీ డిస్కౌంట్స్ ఇవే..