టాటా ఈవీల ధరల తగ్గింపు

టాటా ఈవీల ధరల తగ్గింపు

న్యూఢిల్లీ:  టాటా మోటార్స్ మంగళవారం తన ఎలక్ట్రిక్ వెహికల్స్​ నెక్సాన్​, టియగో మోడల్స్​ధరలను తగ్గించినట్టు ప్రకటించింది. నెక్సాన్​ధర రూ. 1.2 లక్షల వరకు తగ్గడం వల్ల  ఇప్పుడు ఈ మోడల్ ధర రూ. 14.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టియగో ధరలను రూ. 70వేల వరకు తగ్గించింది. ఇప్పుడు దీని బేస్ మోడల్ రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇటీవల ప్రారంభించిన పంచ్​ఈవీ ధరలు మాత్రం మారవు.  బ్యాటరీ ధరలు తగ్గడం వల్లే టాటా మోటార్స్​ ఈ నిర్ణయం తీసుకున్నామని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్  తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈవీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దేశవ్యాప్తంగా వీటిని మరింత అందుబాటులో ఉండేలా చేయడం కంపెనీ లక్ష్యం అని ఆయన తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ విభాగంలో తమ 70 శాతానికి పైగా మార్కెట్ వాటా ఉందన్నారు.