టాటా కర్వ్‌‌‌‌.ఈవీ లాంచ్‌‌‌‌

టాటా కర్వ్‌‌‌‌.ఈవీ లాంచ్‌‌‌‌

టాటా మోటార్స్ బుధవారం మిడ్‌‌‌‌సైజ్‌‌‌‌  ఎలక్ట్రిక్ ఎస్‌‌‌‌యూవీ కర్వ్‌‌‌‌.ఈవీని లాంచ్ చేసింది.  దీని ప్రారంభ ధర రూ.17.49 లక్షలు ( 45కిలోవాట్‌‌‌‌ అవర్‌‌‌‌‌‌‌‌ బ్యాటరీ కెపాసిటీ). ఫుల్ ఛార్జింగ్‌‌‌‌పై 502 కి.మీ వెళుతుందని కంపెనీ  చెబుతోంది. తమ  మొత్తం సేల్స్‌‌‌‌లో ఈవీల వాటా 12 శాతం ఉందని టాటా  మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్‌‌‌‌   ఎండీ శైలేష్‌‌‌‌ చంద్ర అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  లక్ష ఎలక్ట్రిక్ బండ్లను అమ్ముతామని ధీమా వ్యక్తం చేశారు.