టాటా మోటార్స్ లాభం రూ. 3,450 కోట్లు

టాటా మోటార్స్ లాభం రూ. 3,450 కోట్లు

హైదరాబాద్​, వెలుగు : టాటా మోటార్స్​ కన్సాలిడేటెడ్ నికర లాభం సెప్టెంబర్ 2024తో ముగిసిన రెండో క్వార్టర్లో 9.9 శాతం తగ్గి రూ. 3,450 కోట్లకు చేరుకుంది.  గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.3,832 కోట్ల ఏకీకృత నికర లాభం  సంపాదించింది.  

కార్యకలాపాల ఆదాయం గత రెండో క్వార్టర్​లో వచ్చిన రూ. 1,00,534 కోట్లతో పోలిస్తే ఈసారి రూ. 1,04,444 కోట్లకు పెరిగింది.    మొత్తం ఖర్చులు ఈసారి రూ.97,330 కోట్లకు తగ్గాయని కంపెనీ తెలిపింది.