న్యూఢిల్లీ : టాటా మోటార్స్ సెప్టెంబర్ 2023 క్వార్టర్లో రూ. 3,783 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం సంపాదించింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ మెరుగైన పనితీరే దీనికి కారణం. టాటా మోటార్స్ మంచి రిజల్ట్స్ ప్రకటించడం వరసగా ఇది నాలుగో క్వార్టర్. సెప్టెంబర్ 2022 క్వార్టర్లో కంపెనీకి రూ. 1,004 కోట్ల నష్టం వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రెండో క్వార్టర్లో టాటా మోటార్స్ రెవెన్యూ రూ. 1,05,128 కోట్లకు పెరిగింది.
ఇక స్టాండ్ ఎలోన్‌గా చూస్తే కంపెనీకి సెప్టెంబర్ 2023 క్వార్టర్లో రూ. 1,270 కోట్ల లాభం వచ్చింది. ఈ క్వార్టర్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) రెవెన్యూ 30 శాతం పెరిగి 6.9 బిలియన్ పౌండ్లుగా రికార్డయింది. తయారీ, అమ్మకాల జోరు కొనసాగుతుందని టాటా మోటార్స్ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2023–24 ఫైనాన్షియల్ ఇయర్లో ఇబిటా మార్జిన్ 8 శాతానికి మెరుగుపడుతుందని కంపెనీ ఆశాభావంతో ఉంది.
రాబోయే కాలంలోనూ తాజా క్వార్టర్ పనితీరు మెరుగుపడే ఛాన్స్ ఉందనే ధీమాను టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్ఓ పీ బీ బాలాజీ వెల్లడించారు. ఇన్ఫ్లేషన్ నిలకడగా కొనసాగనుందని, పండుగ సీజన్ కారణంగా దేశీయ అమ్మకాలు పెరుగుతాయనే ఆశాభావాన్ని కంపెనీ ఈడీ గిరీష్ వాఘ్ చెప్పారు. కొత్త జనరేషన్ ప్రొడక్టుల సేల్స్ ఊపందుకుంటాయని టాటా మోటార్స్ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్) శైలేష్ చంద్ర పేర్కొన్నారు.
ALSO READ : కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 51 శాతం వాటా కొంటున్న జ్యూరిచ్