దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహన సంస్థ టాటా మోటార్స్ తన వాహనాల ధరలను ఏప్రిల్ 1, 2024 నుంచి పెంచనున్నట్లు ప్రకటించింది. వివిధ మోడల్స్, వేరియంట్లను ధరల పెరుగుదల 2శాతం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇన్ ఫుట్ ఖర్చుల భర్తీ చేయడానికి ధరల పెంపును నిర్ణయించినట్లు పేర్కొంది. ఇంతకుముందు జనవరి 1 న వాణిజ్య వాహనాల ధరలను 3 శాతం, ఫిబ్రవరి 1న 0.7 శాతం పెంచింది. తాజాగా మరోసారి వాహనాల ధరలను పెంచింది.
మరోవైపు గురువారం (మార్చి 7) టాటా మోటార్స్ షేర్ 2.14 శాతం లాభంతో రూ. 1039.35 వద్ద స్థిరపడింది. శనివారం (మార్చి9) ముగింపు స్టాక్ ధర దాని ఒక సంవత్సరం గరిష్ట విలువ రూ. 1065.60 నుంచి కేవలం 2.53 శాతం దూరంలో ఉంది.
ALSO READ :- Good Health: షుగర్ వచ్చిన వాళ్లు ఏం తినాలి... ఏం తినకూడదో తెలుసా...
ఇదిలా వుంటే.. టాటా మోటార్స్ ఇటీవల తన వ్యాపారాలను రెండు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా విడదీయనున్నట్లు ప్రకటించింది. ఒకటి వాణిజ్య వాహనాల వ్యాపారం, రెండో ప్యాసింజర్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, జెఎల్ ఆర్ వంటి ప్రయాణికుల వాహనాల వ్యాపారాల్లో పెట్టుబడుతు పెట్టబడులు పెట్టనుంది.
టాటా మోటార్స్ తన వాహనాలను యూకే, దక్షిణ కొరియా,థాయిలాండ్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేసియా, సార్క్ దేశాలలో విక్రయిస్తోంది.