కార్ల అమ్మకాల్లో టాటా కంపెనీ దూసుకుపోతోంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారత దేశంలో అత్యధికంగా అమ్ముడైన SUV కార్లలో టాటా నెక్సాన్ ముందుంది. వరుసగా మూడో సంవత్సరం కూడా టాటానెక్సాన్ అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. FY 2024కలో మొత్తం 1లక్షా 71వేల 697 టాటా నెక్సాన్ కార్లు అమ్ముడుపోయాయి.
ఇది టాటా పంచ్, మారుతి సుజుకీ భ్రెజ్జూ, హ్యుందాయ్ క్రెటా , మహీంద్ర స్కార్పియో వంటి మోడళ్ల కంటే ఎక్కువ. FY 2022లో 1లక్షా 24వేల 130 కార్లు అమ్ముడవగా.. FY2023లలో 1లక్షా 72వేల 139 SUV కార్లు అత్యధకంగా యూనిట్లు అమ్ముడయ్యాయి. టాటా మోటార్స్ గత ఫైనాన్షియల్ ఇయర్ లో 1లక్షా 70వే 076 టాటా పంచ్ కార్లను సేల్ చేసింది.
టాటా నెక్సాన్ పోటీదారు మారుతి సుజుకీ బ్రెజ్జా FY24లో లక్షా 69వేల 897 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకోగా మిడ్ సైజ్ సెగ్మెంట్ లీడర్ అయిన హ్యుందాయ్ క్రెటా లక్షా 61వేల 653 అమ్మకాలతో వెనకబడి ఉంది. మహీంద్రా స్కార్పియో, N , క్లాసిక్ తో సహా FY24లో 1లక్షా 41వేల 462 యూనిట్లు అమ్మకాలను నమోదు చేసుకుంది.
ఇంతలా అమ్ముడుపోయిన టాటా నెక్సాన్ ధర గురించి మాట్లాడితే.. ప్రస్తుతం ఇది రూ. 8.15 లక్షల నుంచి రూ. 15.80 లక్ష ఎక్స్ షోరూమ్ ధరల మధ్య అమ్ముడవుతోంది. దీనిలో భద్రతాపరమైన ఫీచర్లు చాలా ఉన్నాయి. టాటా నెక్సాన్ లో ఆరు ఎయిర్ బ్యాగులు,ఫ్రంట్ ఫార్కింగ్ సెన్సార్ లతో కూడిన 360 డిగ్రీ సరౌండ్ వ్యూ సిస్ట్ , బ్లైండ్ వ్యూ మానిటర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ( TMPS) ఉన్నాయి. ఫీచర్ లోడెడ్ క్యారెక్టర్, మల్టీపుల్ పవర్ ట్రెయిన్ ఎంపికలతో కస్టమర్లు ఈ టాటా నెక్సాన్ SUVని కొనడానికి ఇష్టడుతున్నారు.
టాటా నెక్సాన్ రెవోట్రాన్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ (120Ps/170Nm) , Revotorq 1.5 డీజిల్ ( 115PS/260Nm) వంటి రెండు ఇంజన్ వేరియంట్లతో అందుబాటులో ఉంది. పెట్రోల్ యూనిట్ లో ట్రాన్స్ మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ MT, 6-స్పీడ్ MT,6-స్పీడ్ AMT,7-స్పీడ్ DCA ఉన్నాయి. డీజిల్ యూనిట్ ట్రాన్స్ మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ MT లేదా 6-స్పీడ్ AMT ఉన్నాయి.