హైదరాబాద్, వెలుగు: ప్యాకేజెడ్ ఫుడ్ కంపెనీ టాటా సోల్‌ఫుల్ " సోల్‌ఫుల్ మసాలా మ్యూస్లీ" ని మార్కెట్లోకి తెచ్చింది. పెరుగుతో తింటే ఇది అల్పాహారానికి చక్కగా సరిపోతుందని తెలిపింది. ఇది 'మస్త్ మసాలా', 'టీఖా ట్విస్ట్' అనే ఫ్లేవర్లలో లభిస్తుంది. టాటా సోల్ ఫుల్ మసాలా మ్యూస్లీలో చిరుధాన్యాలతోపాటు గోధుమ, మొక్కజొన్నలు ఉంటాయి. వీటిని బేకింగ్ పద్ధతిలో తయారు చేశామని, ఫ్రై చేసినవి కావని ప్రకటించింది. సోల్‌ఫుల్ మసాలా మ్యూస్లీలో ప్రిజర్వేటివ్‌లు, ట్రాన్స్ ఫ్యాట్లు ఉండబోవని తెలిపింది.