టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) సంస్థ.. దేశవ్యాప్తంగా ఈ-మొబిలిటీని వేగవంతం చేస్తోంది.దేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన TPREL కీలక మైన మెట్రో పాలిటన్ నగరాల్లో 850 కి పైగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది.
ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, జమ్మూ కాశ్మీర్,శ్రీనగర్, ధార్వాడ్, లక్నో, గోవా వంటి ప్రముఖ నగరాల్లోని 30 బస్ డిపోల్లో వ్యూహాత్మకంగా ఛార్జింగ్ పాయింట్లను ప్రారంభించింది. దీంతోపాటు టాటా పవర్ దేశవ్యాప్తంగా 2300 లకుపైగాన పబ్లిక్ ఈ-బస్సులను ప్రారంభించింది.
లక్షల టన్నుల కంటే ఎక్కువ టెయిల్ పైప్ CO2 ఉద్గారాలను తగ్గించేందుకు బలమైన బస్సు ఛార్జింగ్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడం లక్ష్యంగా టాటా పవర్ పనిచేస్తోంది. ఈ ఛార్జింగ్ పాయింట్ల లో 180 నుంచి 240 KW శ్రేణితో అధిక సామర్థ్యం కలిగిన ఫాస్ట్ ఛార్జర్లను ఏర్పాటు చేసింది. సగటున ఛార్జింగ్ సమయం 1గంటనుంచి గంటన్నరవకు ఉంటుంది.
ఢిల్లీలో అత్యధికంగా ఈ -బస్సు ఛార్జింగ్ పాయింట్లను వినియోగించుకుంటున్నారు. తర్వాత స్థానంలో ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, జమ్మూ, శ్రీనగర్ లు ఉన్నాయి.
దేశంలో జీరో పొల్యూషన్ సాదించేందుకు అనుగుణంగా టాటాపవర్ పనిచేస్తోంది. 2040 నాటికి నికర జీరో ఉద్గారాలను సాధించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. సస్టైన బుల్ ఈజ్ ఎటైనబుల్ ఉద్యమం ద్వారా మరింత బలోపేతం చేస్తున్నారు. ఇది గ్రీన్ ఎనర్జీ సోల్యూషన్ లను స్వీకరించి దీనిని ఒక ప్రజాఉద్యమంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.