భారత్ టాటా కంపెనీ ఈ ఏడాది( 2024) ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సిద్దంగా ఉంది. ఇప్పటికే కొత్త EV కార్లకోసం బుకింగ్ కూడా ప్రారంభించింది. అయితే ధరలను మాత్రం త్వరలో ప్రకటించనుంది. రాబో యే వారం రోజుల్లో ధర వెల్లడించనుంది. దీనికంటే ముందే EV కార్ల లాంచ్ కు ముందే వాటి రంగులు, వేరియంట్ లను వెల్లడించింది టాటా కంపెనీ.
మొత్తం ఐదు రంగుల్లో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తోంది టాటా కంపెనీ. అవి:
- ఎంపవర్డ్ ఆక్సైడ్ డ్యూయెల్ టోన్
- సీడ్ వుడ్ డ్యూయెల్ టోన్
- ఫియర్ లెస్ రెడ్ డ్యూయెల్ టోన్
- డేటో నా గ్రే డ్యూయల్ టోన్
- ప్రిస్టైన్ వైట్ డ్యూయెల్ టోన్
- స్మార్ట్, స్మార్ట్ + అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ +
తో సహా ఐదు వేరియంట్ కలర్లలో ఈవీ కాడ్లను అందిస్తోంది టాటా కాంపెనీ.
2024 లో మొదట మూడు రకాల కలర్లతో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది సంస్థ. వీటిలో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ఆప్షన్ గా ఉంది.
ఆఫర్ కోసం రెండు వెర్షన్లు ఉంటాయి.
- Punch. EV. ఇది
- Punch.Ev లాంగ్ రేంజ్
ఈ రెండు వెర్షన్లు 3.3kw వాల్ బాక్స్ ఛార్జర్ తో అందుబాటులో ఉంటాయి. అయితే Puch .Ev లాంగ్ రేజ్ ఎలక్ట్రిక్ కారు 7.2 kw ఫాస్ట్ ఛార్జర్ తో కూడా అందుబాటులో ఉంటుంది.
టాటా పంచ్ EV అంచనా ధర 9.50 లక్షల నుంచి 12.50 లక్షలు.