కొత్త ఏడాది వచ్చేస్తుంది.. కొత్త కార్లూ వచ్చేస్తున్నాయి.. చాలా రోజులుగా ఎప్పుడెప్పుడూ అని వెయిట్ చేస్తున్న టాటా పంచ్.. ఎలక్రికల్ కారు వచ్చేస్తుంది. 2024, జనవరి చివరి వారంలో మార్కెట్ లో రిలీజ్ చేయటానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తుంది.
కొత్త సంవత్సరంలో కొత్త కార్లతో మార్కెట్లోకి వస్తోంది టాటా మోటార్స్. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్, రేర్ పార్కింగ్ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటివి ఉంటాయని సమాచారం. దీనికి నెక్సాన్ ఈవీ తరహా ఎల్ఈడీ హెడ్‌లైట్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఐసీఈ ఇంజిన్‌తో పోల్చుకుంటే.. ఈవీ మోడల్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ డిజైన్‌లో మార్పులు చేసినట్టు అనిపిస్తోంది. గ్రిల్, బంపర్, 5 స్పోక్ అలాయ్ వీల్స్, రేర్ వీల్ డిస్క్ బ్రేక్స్‌ని కూడా మార్చినట్టు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో.. వాహనాలకు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్లైట్స్ని ఇస్తోంది టాటా మోటార్స్. అందుకే.. టాటా పంచ్ ఈవీలో కూడా దీనిని మనం చూసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టాటా పంచ్ ఈవీ ఇంటీరియర్‌లో భారీ మార్పులో కనిపిస్తాయట! భారీ 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి వస్తాయని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, వయర్లెస్ ఛార్జర్, సన్‌రూఫ్ వంటివి ఈ ఈవీలో చూడొచ్చని సమాచారం.
2024, జనవరి చివరి వారంలో టాటా మోటార్స్.. ఈ టాటా పంచ్ ఈవీ వెహికిల్ ను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం. అయితే ఈ రిలీజ్ డేట్ పై టాటా మోటార్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక దీని ధర విషయానికొస్తే.. ఇది పెద్ద బ్యాటరీ, ఆకర్షణీయమైన ఫీచర్లతో, పూర్తి ఛార్జింగ్‌పై 350 కి.మీ రేంజ్‌తో.. రూ.11.61లక్షల నుంచి రూ.12.79లక్షల వకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది