కోల్‌కతా : టాటా స్టీల్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ రెండు పరాజయాలు నమోదు చేశాడు. రెండో రోజు, గురువారం ఓపెన్ సెక్షన్లో మూడు రౌండ్లు ఆడిన అర్జున్.. సో వెస్లీ, మాగ్నస్ కార్ల్సన్తో జరిగిన గేమ్‌ల్లో ఓటమిపాలయ్యాడు. కీమర్‌తో గేమ్‌ను మాత్రం డ్రా చేసుకున్నాడు. ఈ రౌండ్ తర్వాత అర్జున్ రెండు పాయింట్లతో పదో ప్లేస్‌కు పడిపోయాడు.
విమెన్స్ సెక్షన్ ఆరో రౌండ్లో ద్రోణవల్లి హారిక.. కొస్టానిక్పై నెగ్గింది. గునినా వాలెంటినా, జాగ్నిడెజ్తో జరిగిన గేమ్‌ల్లో ఓడిన హంపి.. కొస్టానిక్తో జరిగిన గేమ్‌ను డ్రాగా ముగించింది. ఈ రౌండ్ తర్వాత హారిక మూడున్నర పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉండగా, హంపి రెండు పాయింట్లతో ఎనిమిదో ప్లేస్‌లో నిలిచింది.