బ్రిటన్‌లో టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా స్టీల్ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. వేల్స్‌లోని పోర్ట్ టాల్బోట్, లాన్‌వెర్న్‌లో పనిచేస్తున్న దాదాపు 1,500 మంది కార్మికులు సమ్మెకు దిగనున్నారు. రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లను మూసివేసి 2,800 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని కంపెనీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా జులై 8 నుంచి వీరు సమ్మె చేయనున్నట్లు ట్రేడ్ యూనియన్ యునైట్ తెలిపింది.
బ్రిటన్‌లో స్టీల్ కార్మికులు సమ్మె చేయనుండటం గత నాలుగు దశాబ్దాలలో ఇదే తొలిసారని కార్మిక సంఘాలు తెలిపాయి. సమ్మె కార్యరూపం దాలిస్తే, టాటా స్టీల్ బ్రిటన్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. టాటా స్టీల్ కార్మికులు తమ ఉద్యోగాల కోసం పోరాడటం లేదని, భవిష్యత్ కోసం పోరాడుతున్నట్లు యునైట్ జనరల్ సెక్రటరీ షారోన్ గ్రాహమ్ అన్నారు. టాటా తన ప్రణాళికలను నిలిపివేసే వరకు సమ్మె కొనసాగుతుందని యూనియన్ పేర్కొంది.
Tata Steel workers in Britain to begin indefinite strike next month https://t.co/67y3bvd1Eq pic.twitter.com/SAWrhlTOAu
— Reuters (@Reuters) June 21, 2024