కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన 12మంది మృతి

ఆగి ఉన్న ట్యాంకర్ ను టాటా సుమో వాహనం ఢీకొట్టడంతో 12మంది మృతి చెందారు. ఈ   ఘోర రోడ్డు ప్రమాదం కర్నాటకలోని చిక్ బళ్లాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. గురువారం(అక్టోబర్ 26) తెల్లవారుజామున చిక్ బళ్లాపూర్ శివారులో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన టాటా సుమో వెహికిల్ అదుపుతప్పి ఆగి ఉన్న ట్యాంకర్ ను ఢీకిట్టింది. 

ఈ  ఘటనలో టాటా సుమోలో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. 

ALS0 READ: కాంగ్రెస్‌‌లో చేరికలు : జాటోత్‌‌ శ్రీనివాస్‌‌ నాయక్‌‌

ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా గోరుంట్ల మండల వాసులుగా పోలీసులు గుర్తించారు. గోరుంట్ల నుంచి కర్నాటకకు కారులో వెళ్తుండగా.. దట్టంగా  పొగ మంచు కమ్ముకోవడంతో ముందు వెహికల్ ను డ్రైవర్ గుర్తించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.