స్వదేశీ టెక్నాలజీతో టాటా సెమీ కండక్టర్ ప్లాంట్.. టార్గెట్ రోజుకు 4.83 కోట్ల చిప్స్ ఉత్పత్తి

స్వదేశీ టెక్నాలజీతో టాటా సెమీ కండక్టర్ ప్లాంట్.. టార్గెట్ రోజుకు 4.83 కోట్ల చిప్స్ ఉత్పత్తి

భారత దేశంలో స్వదేశీ టెక్నాలజీలో వేగంగా అభివృద్ది చెందుతోంది. లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న ఇండియన్ కంపెనీలు ఉత్పత్తిలో వేగంపెంచుకుంటున్నాయి.  ఆగస్టు 3, 2024న స్వదేశీ టెక్నాలజీతో అసోంలో టాటా గ్రూప్ సెమీకండక్టర్స్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసింది. 27వేల కోట్ల సెమీ కండక్టర్ల తయారీ టార్గెట్ గా మోరిగాన్ జిల్లాలోని జాగీరోడ్ లో ఈ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. కంపెనీ ఏర్పాటుతో రోజుకు 4.83 కోట్ల చిప్స్ తయారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ALSO READ | జర్మనీ, జపాన్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే..!

శనివారంనాడు అసోం సీఎం హేమంత్ బిస్వా శర్మ, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ లు ఈ కంపెనీకి భూమి పూజ చేశారు. ఇటీవల ఈ  ప్రాజెక్టుకు యూనియన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ నిర్మాణ పనుల మరో ఐదు నెలల్లో ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రోజుకు 4.83 కోట్ల చిప్స్ తయారు చేయనున్నారు. ఈ ప్లాంట్ ప్రత్యేక ఏంటంటే.. ఇందులో వినియోగిస్తున్న మూడు ప్రధాన టెక్నాలజీలు స్వదేశీ సాంకేతిక తో కలిగివున్నాయి. 

ఈ ఫ్యాక్టరీలో తయారీ చేసే చిప్స్ ను ఎలక్ట్రిక్ వెహికల్స్, పెద్ద పెద్ద కంపెనీల్లో ఉపయోగించేందుకు వాడనున్నారు. నెట్ వర్క్ తయారీ, 5G నెట్ వర్క్ తయారీ,రూటర్లు తయారు చేసే కంపెనీలు ఈ చిప్స్ ను వినియోగించనున్నారు.