ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్.. రూపొందించిన టాటా

ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్.. రూపొందించిన టాటా

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను గుర్తించేందుకు టాటా సంస్థ ఓ కిట్ ను రూపొందించింది.  ఒమిషూర్ పేరుతో రూపొందించిన ఈ కిట్ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)ఆమోదించింది. ఈ కిట్ భారత్ లో మరో వారం నుంచి పది రోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
 
టాటా మెడికల్, డయాగ్నోస్టిక్స్ తయారు చేసిన ఈ కిట్ తో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించవచ్చు. కిట్‌ను యూఎస్ కంపెనీ థర్మో ఫిషర్ డెవలప్ చేసింది. దీని ధరను రూ.250 గా నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్టింగ్ కిట్లతో పోల్చుకుంటే ఒమిషూర్ ధర తక్కువగా ఉంది. 

 

మరిన్నివార్తల కోసం..

విద్యార్థుల వద్దకే వ్యాక్సిన్​