దమ్మపేట వెలుగు : అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ తనకు కేటాయించకపోవడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం దమ్మపేట, అశ్వారావుపేటలో అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు.
దిగజారుడు రాజకీయం చేసే వారి మధ్య ఉండలేక పార్టీకి రాజీనామా చేస్తున్నానట్లు తెలిపారు. ఈనెల 13న దమ్మపేట మండల కేంద్రంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఆ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు.