
- కృత్తిక 2,3,4 పాదములు. రోహిణి 1,2,3,4 పాదములు. మృగశిర 1,2 పాదములు. మీ పేరులో మొదటి అక్షరం ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వు, వే, వో
- ఆదాయం : 11
- రాజపూజ్యం : 1
- వ్యయం : 5
- అవమానం: 3
గురువు: 30.03.2025 నుండి 14.05.2025 వరకు జన్మస్థానముల రజతమూర్తిగాను తదుపరి 18.10.2025 వరకు తామ్రమూర్తిగాను 05.12.2025 నుండి ఉగాది వరకు లోహమూర్తిగాను సంచారము. శని: ఉగాది నుండి మరల ఉగాది వరకు లాభములో సువర్ణమూర్తిగా సంచారము.
రాహు కేతువులు: ఉగాది నుండి మరల ఉగాది వరకు రజిత సువర్ణమూర్తులుగా సంచారము చేయగలరు.ఈ రాశి స్త్రీ పురుషులకు చాలా అనుకూలంగా ఉంటుంది. రైతు సోదరులకు అధిక పంటలు దిగుబడి. వృత్తి వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. లాయర్లకు, డాక్టర్లకు వివాహ ప్రయత్నములు ఫలించగలవు. కాంట్రాక్టర్లు అధిక ఆదాయ వనరులు. విదేశి చదువులు ఫలించగలవు. రాజకీయ నాయకులకు ఆకస్మిక ధనలాబములు. బిగ్ ఇండస్ట్రీ వారికి చాలా సంతృప్తిగా ఉండగలరు. స్మాల్ ఇండస్ట్రీ వారికి ధనాదాయం సమృద్ధిగా ఉంటుంది. జాయింట్ వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది.
►ALSO READ | మేష రాశి వారికి ఈ ఏడాది దబిడి దిబిడే.. ఆదాయం 2, ఖర్చేమో..?
ఫైనాన్స్, చీట్స్, సామాన్యంగా ఉంటుంది. షేర్స్‌లో పెట్టుబడులు అనుకూలంగా ఉండదు. ఎలక్ట్రికల్ వ్యాపారస్తులకు అనుకూలంగాను, సినిమావారికి, టీవీ వారికి కొంతవరకు అనుకూలంగాను, ఆర్టిస్టులకు వారి ప్రయత్నమును బట్టి అభివృద్ధి ఉంటుంది. ప్రైవేట్ జాబ్స్ చేయువారికి కొన్ని రోజులు బాగున్నా ఆదాయ ప్రమోషన్లకు కష్టపడి ఇష్టంగా వర్క్ చేయువారికి మాత్రమే అనుకూలత. మీరు ప్రతి విషయంలోచాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఎప్పటికప్పుడు ఉండవలెను. గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటుంది. అధికారుల ఒత్తిడి ఉండగలదు.
పౌల్ట్రీ వారికి కొన్ని రోజులు అనుకూలం, కొన్ని రోజులు బ్యాలెన్స్గాను ఉంటుంది. వెండి బంగారం వారికి ఆర్థికంగా వెసులుబాటు ఉండగలదు. సిమెంట్, ఐరన్, కంకర వారికి రెడిమిక్స్ వారికి అధిక ఆదాయం. ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొనువారికి ఒకరకంగాను వ్యాపారంలో ఏకాగ్రతను బట్టి అనుకూలత వ్యతిరేకత ఉండగలదు. పాజిటివ్‌గా ఉండాలి. ఫిష్ వ్యాపారులకు అనుకూలత. మరల లాస్ట్‌లో కొన్ని సమస్యలకు లోనవుతారు. మొత్తం మీద ఆలోచన చేసిన ఈ పేరు కలిగిన అన్ని రంగంలలో ఉన్నవారికి సంతృప్తికరంగా ఉండగలరు.
ప్రధానంగా మీ తెలివితేటలు అవసరం ఉంటుంది. చాకచక్యంగా ఎప్పుడు చురుకుగా ఉండగలరు. కోర్టుకేసులు పరిష్కరించుకొనుటకు సరైన సమయము. పంతాలు, పగ ద్వేషమునకు సమయము కాదు. వివాహ శుభముహూర్తములలో తలదించి అందరితో ఆప్యాయంగా ఉండండి. కృత్తిగా నక్షత్రం వారు జాతి కెంపు ధరించి ప్రతిరోజు సూర్యనారాయణ పూజలు, ఆదిత్య హృదయం పారాయణ, సూర్య నమస్కారములు చేయండి. రోహిణి నక్షత్రం వారు ముత్యం ధరించి, దుర్గాదేవికి పూజలు, పగడమాలను ధరించండి.
►ALSO READ | శ్రీ విశ్వావసు నామ సంవత్సర గంటల పంచాంగం.. జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి
దుర్గా పారాయణం నిరంతరం చేయుట వలన అనేక విధములుగా ఆదాయ వనరులు. మృగశిర నక్షత్రం వారు పగడం ధరించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకములు చేయుచున్న మీకు భూములు వగైర కోర్టు కేసులు పరిష్కారము. గృహము లేనివారికి గృహం, వివాహం, సంతానం, భార్యాభర్తల గొడవలు, కోర్టు కేసులలో పట్టుదల తగ్గి రాజీమార్గంతో ప్రశాంతంగా ఉంటారు.
కందులు గోవుకు 450 గ్రా. 9 మంగళవారములు స్కందగిరి దేవాలయంలో అభిషేకం, హోమము చేయుట వలన ప్రతి విషయంలో సంతృప్తిగా ఉంటుంది. ఆయుర్వేదంలో ఆరోగ్యం ఉన్నది. ధ్యానం, యోగ, ఆక్యప్రెషర్ చేసుకొని ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఈ సంవత్సరం ఆర్థికంగా సంతృప్తిగా ఉంటుంది. కాని కర్మ నివారణ విషయంలో ఎంతటివారు అయినా తప్పించుకొనలేరు. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగండి. ప్రయాణంలో ఇష్టదైవ ప్రార్థన. అదృష్టసంఖ్య 6.