
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం(అక్టోబర్15న) ఉదయం టేక్మాల్ మండం బోడ్ మ్మాట్ పల్లి వద్ద నాందేడ్ - అఖోల 161వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన టవేరా వాహనం అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
ఈ ఘటనలో టవేరా వాహనంలో ప్రయాణిస్తున్న 12మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానాకు తరలించారు.