స్టూడెంట్లకు ఇండియాస్​ బెస్ట్​డాన్సర్​ అవార్డులు

స్టూడెంట్లకు ఇండియాస్​ బెస్ట్​డాన్సర్​ అవార్డులు

కోల్​బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్​లోని తవక్కల్ ​హైస్కూల్ ​స్టూడెంట్లు ఇండియాస్ బెస్ట్ ​డాన్సర్​అవార్డులు అందుకున్నట్లు విద్యా సంస్థల అధినేత ఎండీ అబ్దుల్ ​అజీజ్ తెలిపారు. స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని ఈనెల 18న హైదరాబాద్​లోని భారతీయ విద్యాభవన్​లో మయూరి ఆర్ట్స్​ఆధ్వర్యంలో పోటీలు జరిగాయన్నారు. 

ఇందులో పాఠశాలకు చెందిన ఎల్లంకి రిశికసాయి, రావికంటి సాయి బాంధవ్య, డి.వైష్ణవి, ఐశ్వర్య ప్రతిభ కనబర్చి ఇండియాస్​బెస్ట్​ డ్యాన్సర్​అవార్డులు దక్కించుకున్నట్లు తెలిపారు. గురువారం స్కూల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం సన్మానించింది.