ది సబర్మతి మూవీకి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలి

  • రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. గోద్రా ఘటనను తప్పుగా చిత్రీకరించి చరిత్రను కనుమరుగు చేసేందుకు యత్నించిన కాంగ్రెస్, ఒక సెక్షన్ మీడియా కుట్రలను ఈ సినిమా బట్ట బయలు చేయడం అభినందనీయమన్నారు.  హైదరాబాద్ లోని జీవీకే మాల్ లో ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను బీజేపీ నేతలతో కలిసి బండి సంజయ్ చూశారు.ఈ సినిమాకు యూపీలో ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారని, తెలంగాణలోనూ ఇవ్వాలన్నారు.