GST : రూ. 25వేల కోట్ల విలువైన జీఎస్టీ ఎగ్గొట్టారు

GST : రూ. 25వేల కోట్ల విలువైన జీఎస్టీ ఎగ్గొట్టారు

న్యూఢిల్లీ: జీఎస్టీ కింద నమోదైన దాదాపు 18వేల నకిలీ కంపెనీలను పన్ను అధికారులు గుర్తించారు. ఇవి దాదాపు రూ.25 వేల కోట్ల విలువైన జీఎస్టీని ఎగ్గొట్టాయని తెలిపారు.  నకిలీ కంపెనీలకు వ్యతిరేకంగా ఇటీవల ముగిసిన అఖిల భారత డ్రైవ్‌‌‌‌లో జీఎస్టీ అధికారులు 18 వేల నకిలీ కంపెనీలను గుర్తించారు.

 అవి వస్తువులను అసలు అమ్మకుండా ఇన్‌‌‌‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందాయి.   స్పెషల్ డ్రైవ్ సందర్భంగా కంపెనీలు సుమారు రూ.70 కోట్ల జీఎస్టీని స్వచ్ఛందంగా చెల్లించాయి. నకిలీ రిజిస్ట్రేషన్లకు వ్యతిరేకంగా రెండో ఆల్-ఇండియా డ్రైవ్ ఆగస్టు 16న ప్రారంభమైంది. ఇది అక్టోబర్ చివరి వరకు కొనసాగింది.