కొత్తగూడ,వెలుగు: ప్రస్తుతం బీజేపీ పాలనలో పన్నుల మోతతో దేశంలో ట్యాక్స్ టెర్రరిజం నడుస్తోందని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లిలో కొత్తగూడ, గంగారం మండలాలకు సంబంధించి పార్లమెంట్ఎన్నికల సన్నాహక సభ జరిగింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తినే తిండితో పాటు పుడితే పన్ను..చస్తే పన్ను వేస్తోందని, ఆ పన్నులను చూసి జనాలు భయపడుతున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల్లోని ప్రజాప్రతినిధులను, లీడర్లను అవినీతి పేరుతో బెదిరించి భయపెట్టి బీజేపీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్‌తో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోందని కోడ్ ముగియగానే హామీలన్ని అమలు చేస్తామన్నారు.
అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తూనే ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే దిశగా మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఈ సారి కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ మాట్లాడుతూ తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే నేటికీ కనిపిస్తోందని, బీజేపీ, బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. ఇన్చార్జి అనిల్‌కుమార్, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్,స్టేట్ఆర్గనైజింగ్సెక్రెటరీ చల్లా నారాయణ రెడ్డి, కొత్తగూడ,గంగారం మండలాల అధ్యక్షులు వజ్జ సారయ్య, జాడి వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్అధ్యక్షుడు మొగిలి, ఎంపీపీలు విజయారూప్సింగ్, సరోజన, జడ్పీటీసీలు పుష్పలత, రమ పాల్గొన్నారు.