Viral news: దేవుని ప్రసాదంలో మత్తు కలిపి..ట్యాక్సీ డ్రైవర్ను దోచుకున్న ప్యాసింజర్

Viral news: దేవుని ప్రసాదంలో మత్తు  కలిపి..ట్యాక్సీ డ్రైవర్ను దోచుకున్న ప్యాసింజర్

ప్రస్తుత పరిస్థితుల్లో నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ లో ఖాతాలు ఖాళీ చేయడం, బెదిరించి డబ్బులు  ఖతాలకు మళ్లించడం,  ఉద్యోగాల పేరుతో మరోలా ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.. ఆన్ లైన్ మోసాలు ఇలా ఉంటే..ఆఫ్ లైన్ మోసాలు మరోలా ఉన్నాయి.  చైన్ స్నాచింగ్, సెల్ ఫోన్ స్నాచింగ్ లు, దొంగతనాలు, దోపిడీ మరోవైపు పెరుగుతున్నాయి. మోసాలు , దోపిడీలు చేసేందుకు దుర్మార్గులు దేవుళ్లను కూడా వాడుకుంటున్నారు. మూడు రోజులు క్రితం మధ్య ప్రదేశ్ లో ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది. దేవుడి ప్రసాదం లో మత్తు మందు కలిపి ట్యాక్సీ డ్రైవర్ ను దోచుకున్నాడు ఓ ప్యాసింజర్. వివరాల్లోకి వెళ్లితే.. 

దేవుని ప్రసాదంలో మత్తుమందు ఇచ్చి ట్యాక్సీ డ్రైవర్ ను ప్యాసింజర్ దోచుకెళ్లిన ఘటన మూడు రోజులు క్రితం మధ్యప్రదేశ్ లోని దాబ్రా ప్రాంతంలో జరిగింది. బాధితుడు డ్రైవర్ సర్మాన్  మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంలో వెలుగులోకి వచ్చింది. 
మధ్యప్రదేశ్ లోని ఝాన్సీ నుంచి కచాహ్రీ ప్రాంతాలని వెళ్లాలని సర్మాన్ ట్యాక్సీ ఎక్కాడు ఓ ప్రయాణికుడు. జర్నీలో డ్రైవర్ తో మాటామాటా కలిపి దారిలో ఉన్న దాటియా ప్రసిద్ద పీతాంబర మయి దేవాలయం వద్ద ఆపగలరా అని రిక్వెస్ట్ చేశాడు ప్రయాణికుడు. ఇద్దరు కలిసి దైవ దర్శనం చేసుకున్నారు. డ్రైవర్ సర్మాన్ తో స్నేహం పెంచుకున్న ప్రయాణికులు అతనికి ప్రసాదంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు.. అది తిన్న సర్మాన్ స్పృహ కోల్పోయాడు. 
సర్మాన్ స్పృహలోకి వచ్చి చూస్తే.. రోడ్డుపక్కన పడికొని ఉన్నాడు. అయోమయంలో ఉండగా.. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. తేరుకొని సర్మాన్ వింత కథను పోలీసులకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
సర్మాన్ ను మోసగించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి సంఘటనల తరుచుగా జరుగుతుంటాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు.