Income Tax: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. 2020-21 సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్ కోసం ఎదురు చూస్తు్న్న ఏప్రిల్ 30,2024 నాటికి టాక్స్ పేయర్లకు చెల్లింపులు పొందుతారని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ నుంచి మెయిల్స్ ద్వారా పన్ను చెల్లింపుదారులకు సమాచారం అందుతుందని పేర్కొంది.
గడువు లోపు కేంద్రీకృత ప్రాసెసింగ్ సెంటర్ ద్వారా ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత పన్ను చెల్లింపుదారులకు ఓ ఇన్ టిమేషన్ నోటీసు జారీ అవుతుంది. ఇది దాఖలు చేసిన ఐటీఆర్ విజయవంతంగా ప్రాసెస్ చేయబడిందని అర్థం.CPC రిటర్న్ ను ప్రాసెస్ చేయడానికి గడువు ఐటీఆర్ దాఖలు చేసిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి ఒక సంవత్సరం. కాబట్టి 2020-21 కోసం ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు 25021-22.. దీంతో ఈ రీఫండ్ ను ప్రాసెస్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు చివరి విండో మార్చి 31,2023.
ALSO READ :- పార్లమెంట్ ఎన్నికల తరువాత ఆమెరికాకు కేసీఆర్ కుటుంబం జంప్ : బండి సంజయ్
అయితే 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్ లు పెండింగ్ ఉన్నాయి. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా 2020-21 అసెస్ మెంట్ ఇయర్ కు సంబంధించిన చాలా ఐటీ రిటర్న్ లు పెండింగ్ లో ఉన్నాయని CBDT ఓ నోటిసులో పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్ డేట్ చేయబడిన అదాయపు పన్ను రిటర్న్ ని సమర్పించడానికి గడువు మార్చి 31, 2024 తో ముగియనుంది. 2022లో ప్రవేశపెట్టబడిన కేంద్ర ఫైనాన్స్ యాక్ట్ ఆఫ్ 2022 .. దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులకు అనుమతిస్తుంది. సంబంధిత అసెస్ మెంట్ సంవత్సరం (కొన్ని షరతులతో ) 24నెలలలోపు అంటే రెండు సంవత్సరాల్లో అప్ డేట్ చేయబడిన రిటర్న్ ను ఫైల్ చేయవచ్చు.