యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ లో అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్ ఫైనల్ కు చేరుకున్నాడు. భారత కాలమాన ప్రకారం శనివారం (సెప్టెంబర్ 7) ఉదయం జరిగిన రెండో సెమీ ఫైనల్ లో తన దేశానికే చెందిన టియాఫోను ఓడించి తన కెరీర్ లో తొలిసారి ఫైనల్ కు చేరాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్లో 4-6, 7-5, 4-6, 6-4, 6-1 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టాడు. దీంతో 18 సంవత్సరాల తర్వాత ఒక అమెరికా ప్లేయర్ యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు.
ఆండీ రాడిక్ 2003లో యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. 2006 లో ఫెదరర్ పై యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడిపోయాడు. 2009 తర్వాత ఒక అమెరికా ప్లేయర్ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ప్రవేశించాడు. మరో సెమీ ఫైనల్లో ప్రపంచ నంబర్ 1 జానిక్ సిన్నర్
7-5, 7-6 (3), 6-2తో జాక్ డ్రేపర్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాడు. దీంతో యూఎస్ ఓపెన్ లో ఫైనల్ కు చేరిన తొలి ఇటాలియన్ ప్లేయర్ గా నిలిచాడు. ఆదివారం (సెప్టెంబర్ 8) ఫైనల్ జరుగుతుంది.