బీజేపీలోకి టీబీజీకేఎస్​ లీడర్లు

బీజేపీలోకి టీబీజీకేఎస్​ లీడర్లు

కోల్​బెల్ట్, వెలుగు: నస్పూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు టీబీజీకేఎస్​లీడర్లు బీజేపీలో చేరారు. ఆ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ రాఘునాథ్ ​వెరబెల్లి సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకున్నారు.

ఆదివారం మంచిర్యాల జిల్లా పార్టీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీరాంపూర్​ ఏరియాకు చెందిన టీబీజీకేఎస్​ డిప్యూటీ జనరల్​ సెక్రటరీ చాట్ల అశోక్, ఆర్కేపీ పట్టణ బీఆర్ఎస్​ మాజీ జనరల్​ సెక్రటరీ, కోలిండియా క్రీడాకారుడు కట్ట ఈశ్వరాచారి, జీడి ప్రభాకర్, కుమారస్వామిలతోపాటు మందమర్రి మండలం పులిమడుగు గ్రామానికి చెందిన పలువురు యువకులు చేరారు. కార్యక్రమంలో చెన్నూరు అసెంబ్లీ బీజేపీ కన్వీనర్​అక్కల రమేశ్, ఆర్కేపీ టౌన్​ ప్రెసిడెంట్​ వేముల అశోక్, లీడర్లు ధన్​సింగ్, బంగారి వేణుగోపాల్, కల్యాణం రమేశ్, వైద్య  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.