సింగరేణికి కొత్త గనులు కేటాయించాలి : టీబీజీకేఎస్​ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి

సింగరేణికి కొత్త గనులు కేటాయించాలి : టీబీజీకేఎస్​ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి

గోదావరిఖని, వెలుగు: తెలంగాణలోని కొత్త బొగ్గు బ్లాక్‌‌‌‌‌‌‌‌లను, గనులను వేలం వేయకుండా సింగరేణికే కేటాయించాలని టీబీజీకేఎస్​ ప్రెసిడెంట్​ మిర్యాల రాజిరెడ్డి డిమాండ్​ చేశారు. శుక్రవారం గోదావరిఖనిలోని ఆర్జీ 1 ఏరియా జీఎం ఆఫీస్​ ముందు యూనియన్​లీడర్లు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల సింగరేణి ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, సంస్థను కాపాడుకోవడానికి కార్మిక లోకం కదిలిరావాలని పిలుపునిచ్చారు. 

సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు అధునాతన వైద్యం అందించాలని, రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మాదాసు రామ్మూర్తి, లీడర్లు నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, శంకర్, ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సంపత్ రెడ్డి, ఎల్.వెంకటేశ్‌‌‌‌‌‌‌‌, సతీశ్‌‌‌‌‌‌‌‌​, ఐ.సత్యం, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.