
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ చేతకానితనం వల్ల కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని ఏఐటీయూసీ జనరల్సెక్రటరీ కొరిమి రాజ్కుమార్మండిపడ్డారు. సోమవారం మందమర్రి ఏరియా కేకే5 గనిపై నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. 11వ వేజ్‌బోర్డు సాధించడంలో ఏఐటీయూసీ కీలకపాత్ర పోషించిందన్నారు.
బకాయిల విషయంలో కార్మికులు అసంతృప్తితో ఉన్నారని, ఇచ్చిన మొత్తంలో సగం ఇన్కమ్ ట్యాక్స్, ఇతర పన్నుల రూపంలో కోత విధించారన్నారు. కోలిండియా యాజమాన్యం పెర్క్స్‌పై పన్నును భరిస్తోందని, సింగరేణి కూడా ఈ పద్ధతినే పాటించాలని డిమాండ్‌చేశారు. సొంతింటి పథకం కింద కార్మికులకు 2 గుంటల స్థలం, రూ.20లక్షలు వడ్డీలేని రుణం ఇవ్వాలన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు రాకుండా రాష్ట్ర సర్కార్, సింగరేణి యాజమాన్యం అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.
ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీగా ఎన్నికై మొదటిసారిగా ఇక్కడి వచ్చిన రాజ్‌కుమార్‌ను ఏఐటీయూసీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండీ అక్బర్అలీ, మందమర్రి బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శనం, జాయింట్‌సెక్రటరీ కంది శ్రీనివాస్, అసిస్టెంట్ సెక్రటరీ సొమిశెట్టి రాజేశం, ఆర్గనైజింగ్, పిట్సెక్రటరీలు గాండ్ల సంపత్, మర్రి కుమారస్వామి, శర్మ, దేవసాని సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.