
హైదరాబాద్, వెలుగు: జ్యూయలరీ బ్రాండ్ టీబీజెడ్ -ది ఒరిజినల్, హైదరాబాద్ కొండాపూర్‌లో తమ 3వ స్టోర్‌ను గురువారం ప్రారంభించింది. కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ప్రారంభోత్సవ ఆఫర్లను కూడా అందిస్తున్నామని తెలిపింది. మొదటి 100 మంది కొనుగోలుదారులకు 100 బంగారు నాణేలు ఇస్తారు. బంగారం ఆభరణాల తయారీపై 50శాతం తగ్గింపు పొందవచ్చు. వజ్రాల ఆభరణాలపై తయారీ చార్జీలు ఉండవు. నటి పాయల్ రాజ్‌పుత్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ స్టోర్‌లో యాంటిక్ టెంపుల్జ్యూయలరీ కూడా ఉంటుంది.