మహిళా శక్తిని మించినది ఏదీ లేదు.. ‘ప్రియదర్శిని రైజ్ టు లీడ్’లో మంత్రి సీతక్క

మహిళా శక్తిని మించినది ఏదీ లేదు.. ‘ప్రియదర్శిని రైజ్ టు లీడ్’లో మంత్రి సీతక్క

ఘట్​కేసర్, వెలుగు: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఆదర్శంగా తీసుకుని మహిళలు ధైర్యంగా ముందుకుసాగాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. పోచారం మున్సిపాలిటీ కొర్రెములలో మంగళవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ప్రియదర్శిని రైజ్ టు లీడ్ -2025 విమెన్స్​కన్వెన్షన్’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువతులు, మహిళలు రాజకీయాల్లోనూ రాణించాలని కోరారు. ప్రపంచంలో మహిళా శక్తిని మించినది ఏదీ లేదన్నారు.

ఇందిరా గాంధీ ధైర్యంగా ముందుకు సాగి, దేశం కోసం ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక న్యాయం, మహిళా నాయకత్వమేనన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంటే కేసీఆర్​ఓర్వడం లేదన్నారు. సునీతామహేందర్​రెడ్డి, జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్​భాను, పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్​యాదవ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిరి శివచరణ్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మకు అజయ్, మహిళలు పాల్గొన్నారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఆదర్శంగా తీసుకుని మహిళలు ధైర్యంగా ముందుకుసాగాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. పోచారం మున్సిపాలిటీ కొర్రెములలో