హైదరాబాద్, వెలుగు: లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (టీసీఐ) సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్ లో రూ.107.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు క్వార్టర్లో వచ్చిన రూ.87.8 కోట్ల నుంచి 22.2శాతం పెరిగింది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.1,004.8 కోట్ల నుంచి 12.6శాతం పెరిగి రూ.1,131.4 కోట్లకు చేరుకుంది.
ఇబిటా రూ.131.9 కోట్ల నుంచి రూ.151.9 కోట్లకు పెరిగింది. ఇది 15.2శాతం వృద్ధిని సూచిస్తోంది. కంపెనీ ఆదాయం వార్షికంగా రూ.911.4 కోట్ల నుంచి 11శాతం వృద్ధితో రూ.1,012.0 కోట్లకు పెరిగింది. స్టాండెలోన్ లాభం రూ.66.4 కోట్ల నుంచి రూ.82.5 కోట్లకు వృద్ధి చెందింది.