టీసీఐ లాభం రూ.102 కోట్లు

టీసీఐ లాభం రూ.102 కోట్లు

హైదరాబాద్​, వెలుగు:ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (టీసీఐ) 2025 ఆర్థిక సంవత్సరం మూడవ క్వార్టర్​లో రూ.102 కోట్ల  లాభాన్ని సాధించింది. గత సంవత్సరం ఇదే క్వార్టర్​లో రూ.80.2 కోట్ల లాభం వచ్చింది. 

ఏడాది ప్రాతిపదికన ఇది 27.3శాతం పెరిగింది. ఆదాయం రూ.1,011 కోట్ల నుంచి  14.1శాతం పెరిగి రూ.1,153  కోట్లకు చేరుకుంది. ఇబిటా రూ.127.6 కోట్ల నుంచి రూ.147.8 కోట్లకు పెరిగింది. 

డిసెంబర్ 31, 2024తో ముగిసిన తొమ్మిది నెలల్లో కన్సాలిడేటెడ్​ ఆదాయం 12.3 శాతం పెరిగి రూ.2,974.6 కోట్ల నుంచి రూ.3341.3 కోట్లకు చేరుకుంది. తొమ్మిది నెలల నికర లాభం 19.8శాతం పెరిగి రూ.301.0 కోట్లకు ఎగిసింది. ఇబిటా 12.8శాతం పెరిగి రూ.435.5 కోట్లకు చేరుకుంది.