
భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు.. గత ఏడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మరువక ముందే.. అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది.. ముంబైలోని టీసీఎస్ లో రిక్రూటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్న మానవ్ శర్మ భార్య వేధింపులు తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య వేదిస్తోందంటూ.. ఆత్మహత్యకు ముందు మానవ్ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో హృదయాలను కలిచివేసే విధంగా ఉంది. ఫిబ్రవరి 24 జరిగిన ఈ ఘటన శుక్రవారం ( ఫిబ్రవరి 28, 2025 ) వెలుగులోకి వచింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో డిఫెన్స్ కాలనీకి చెందిన మానవ్ శర్మ టీసీఎస్ లో రిక్రూటింగ్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఏడాది క్రితం వివాహమైన మానవ్ ఫిబ్రవరి 24న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు మానవ్ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోలో తన భార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు మానవ్. మగాళ్ల గురించి కాస్త ఆలోచించండి అంటూ మానవ్ కన్నీటి పర్యంతం అవుతున్న వీడియో హృదయాలను కలిచివేసే విధంగా ఉంది.
Also Read:-సినిమా క్లైమాక్స్ను తలపించిన ఛేజింగ్..
తన భార్య విపరీతంగా టార్చర్ చేసేదని.. తనతో చాలా దురుసుగా ప్రవర్తించేదని సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చారు మానవ్. భార్య ప్రవర్తన చూసి తనకు అనుమానం వచ్చిందని.. భార్య వల్ల రోజూ మానసిక క్షోభకు గురయ్యానని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు మానవ్. వీడియోలో తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పిన మానవ్.. మగాళ్ల కోసం ప్రత్యేక చట్టాలు ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎవరో ఒకరు డవచేసి మగాళ్ల గురించి గొంతు విప్పాలని కోరుతూ ఉరి బిగించుకున్నారు మానవ్.
यूपी : आगरा में TCS कंपनी के रिक्रूटमेंट मैनेजर मानव शर्मा ने फांसी लगाकर जान दे दी। मरने से पहले मानव ने रोते हुए Video बनाया।
— Sachin Gupta (@SachinGuptaUP) February 28, 2025
इसमें कहा– "मैं पत्नी से तंग आ चुका हूं। प्लीज मर्दों के बारे में कोई तो बात करे, वो बहुत अकेले हो जाते हैं" pic.twitter.com/RldGT8SnG3
మానవ్ తండ్రి ఫిర్యాదు:
ఈ ఘటనపై మానవ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానవ్ కి ఏడాది క్రితం వివాహం అయ్యిందని, పెళ్లి తర్వాత ఉద్యోగరీత్యా ముంబైలో ఉంటున్నారని తెలిపారు మానవ్ తండ్రి. మానవ్ భార్య తరచూ గొడవ పడదని.. తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెడతానని బెదిరించేదని ఫిర్యాదులో పేర్కొన్నారు మానవ్ తండ్రి.
తమ కోడలు, ఆమె కుటుంబంతో కలిసిమానవ్ ను తీవ్రంగా వేధించేదని.. అందువల్లే మానవ్ తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు తండ్రి. మానవ్ శర్మ ఆత్మహత్యతో భార్య వేధింపులకు బలవుతున్న భర్తల దీనగాథను మరోసారి తెరపైకి తెచ్చిందని... ఇకనైనా మగాళ్ల కోసం ప్రత్యేక చట్టాలు తేవాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.